పార్లమెంట్ సమావేశాలు రద్దు.. మాకు మాట మాత్రమైనా చెప్పరా?

పార్లమెంట్ సమావేశాలు రద్దు.. మాకు మాట మాత్రమైనా చెప్పరా?

న్యూఢిల్లీ: కరోనా కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయంపై విపక్ష ఎంపీలు సీరియస్ అవుతున్నారు. విపక్ష పార్టీలకు మాట మాత్రం కూడా చెప్పకుండా సెషన్స్‌‌ను ఎలా రద్దు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రి బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌‌లో ఈ అంశంపై చర్చించకపోవడం అవమానకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. రాజ్య సభలో విపక్ష నేత అయిన గులాం నబీ ఆజాద్‌‌ను ప్రభుత్వం సంప్రదించలేదన్నారు. 

‘రాజ్యసభలో విపక్ష నేతను ఎవరూ సంప్రదించలేదు. ప్రహ్లాద్ జోషి ఎప్పటిలాగే నిజం నుంచి పారిపోతున్నారు’ అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఇదే విషయంపై బెంగాల్‌‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌‌ను ప్రశ్నించగా.. ‘విపక్ష ఎంపీలను సంప్రదించారా? మీరు జోక్ చేస్తున్నారా’ అంటూ బదులిచ్చారు.