
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జీలను నియమించినట్టు టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా టీఆర్పీ కార్యవర్గాలను నియమించి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర స్టేట్ ఆఫీసుకు అందజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాల ఇన్‌చార్జీలుగా సుధగాని హరిశంకర్‌గౌడ్ (రంగారెడ్డి), మాదం రజనీ కుమార్‌యాదవ్(కరీంనగర్), వట్టే జానయ్య యాదవ్ (నల్గొండ), జ్యోతి పండల్ (మెదక్), కలివేముల మధుబాబు (ఖమ్మం), సంగెం సూర్యారావు(మహబూబ్‌నగర్), పల్లెబోయిన అశోక్ ముదిరాజ్(వరంగల్), భావన వెంకటేశ్(హైదరాబాద్), కొమ్ముల ప్రవీణ్(ఆదిలాబాద్)ను నియమించినట్టు మల్లన్న పేర్కొన్నారు.