పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థులను  గెలిపించుకోవాలి  :  జాజుల శ్రీనివాస్ గౌడ్

ఖైరతాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్ బీసీ సంఘాలకు, నేతలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. బీసీలకు ప్రత్యేక ప్లాట్ ఫాం అవసరమని  జాజుల తెలిపారు. అందుకే 2028 నాటికి ఒక పార్టీని సిద్ధం చేస్తానని ప్రకటించారు. 

జనాభా ప్రకారం ప్రధాన పార్టీలు టిక్కెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీసీలకు బీఆర్ఎస్​  23 సీట్లు ఇస్తే.. కాంగ్రెస్​ 22 ఇచ్చింది. బీజేపీ 36 టిక్కెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవని నోట్లు, మద్యం పంచుతూ గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని జాజుల పేర్కొన్నారు.  సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ,  వర్కింగ్​ప్రెసిడెంట్​ శ్రీనివాస్​ ముదిరాజ్, కేంద్ర కమిటీ  విద్యార్ధి సంఘం అధ్యక్షుడు  తాటికొండ విక్రం గౌడ్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు  కనకాల శ్యామ్​కురుమ పాల్గొన్నారు.