ఎన్నికల బహిష్కరణ: పాస్ బుక్ రాలే..ఓటేయం

ఎన్నికల బహిష్కరణ: పాస్ బుక్ రాలే..ఓటేయం

భూ ప్రక్షాలన జరిగిన ఇన్ని రోజులైనా.. ఆ ఊరికి ఈ పట్టాదారు పాసు బుక్ లు అందలేదు. దీంతో ఆగ్రహించిన రైతాంగం లోక్ సభ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా చేశారు పూడూరుం మండలం చీలాపూర్ గ్రామస్తులు.తమ గ్రామంలో అధి కారులెవరూ ఎన్నికలఏర్పాట్లు చేయొద్దని వారు స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగారు.

 కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా స్పందించరా?

పాస్ పుస్తకాల కోసం ఆర్నెల్ లు గా ఈ గ్రామ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పూడూరు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఒక రైతు ఆత్మహత్యా యత్నం చేశాడు కూడా. అప్పడు హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు తొలి విడత రైతు బంధు కింద 305 మంది రైతులకుగాను168 మంది రైతులకు మాత్రమే చెక్కు లు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెండో విడత రైతుబంధు పథకం చెక్కు లు వీరికి అందనే లేదు. అంతేకాకుండా గ్రామంలో 8 మంది రైతులు చనిపోయారు. వారికి ప్రభుత్వపరంగా రావలసిన రైతు బీమా సొమ్ము దక్కలేదు. ఈ పాస్ బుక్ లేని కారణంగానే బీమా సొమ్ము అందజేయలేదని రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఒక రైతు దహన సంస్కారాలకు గ్రామస్తులంతా చందాలు పోగుచేసి  అంత్యక్రియలు పూర్తి చేయాల్సివచ్చిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై వికారాబాద్ కలెక్టర్, ఆర్డీఓ రెవెన్యూ శాఖ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుబంధు రాదు.. ‘కిసాన్ సమ్మాన్ ’ సొమ్ముదక్కదు….

గ్రామంలో దాదాపు 850 ఎకరాల భూమి 305 మంది రైతుల పేరున పట్టా ఉంది. గతంలో వీరంతా తహసీల్దార్ ర్యాలయంలో పహాణీ పొంది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రక్షాళన జరిగిన తర్వాత గ్రామంలో వీఆర్ఏ ఆంజనేయులు తప్ప ఒక్క రైతుకు కూడా ఈ పాస్ బుక్ అందలేదు. దీంతో ఇటు రెండో విడత రైతు బంధు సొమ్ముకు నోచుకోవడం లేదు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కిసాన్ సమ్మా న్’ కింద ఇచ్చిన తొలివిడ త సొమ్ము కూడా పొందలేకపోయారు. అందుకే ప్రభుత్వం దిగివచ్చి తమకు న్యాయం చేసేవరకు లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.8లోగా పట్టాదారు పాసుపుస్తకాలిస్తాం ..గ్రామస్తుల ఆందోళన నేపథ్యం లో తహసీల్దార్ వహీదా కార్టూ న్, పోలీసు సిబ్బందితో సహా చీలాపూర్ కు శుక్రవాం చేరుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుపై విచారణ జరిపారు. కలెక్టర్ కు నివేదిక అందించి ఈ నెల 8వ తేదీలోగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. గడువులోపు పట్టా పాసు పుస్తకాలు అందక పోతే ఈనెల 11న జరిగే లోక్ సభ ఎన్నికలు తప్పకుండా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.