
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆగస్టు 28న కదులుతున్న మెట్రోలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్ మెట్రోలో రైల్లో ఫ్యాషన్ షో జరగడంతో అదంతా చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. వారాంతం కావడంతో కోచ్‌లు జనంతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే మోడల్స్ మెట్రోలో ఫ్యాషన్ షో చేయడం ప్రారంభించడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా, వారు ధరించిన దుస్తులు వివిధ ఫ్యాషన్ సంస్థల నుంచి వర్ధమాన యువకులచే రూపొందించబడ్డాయి.
ఈ ఫ్యాషన్ షోలో స్పషల్ అట్రాక్షన్ ఏంటంటే.. 2 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న వారు పాల్గొనడం. వారితో పాటు పలువురు సైతం ప్రదర్శనలో పాల్గొన్నారు. నాగ్‌పూర్ మెట్రో 'సెలబ్రేషన్ ఆన్ వీల్' అనే పథకాన్ని అమలు చేయడం గమనార్హం. ఈ పథకం కింద వివిధ సంస్థలు, సమూహాలు, వ్యక్తులు రుసుముతో వేడుకలు లేదా అలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతిస్తోంది.
नागपुर में चलती मेट्रो में फैशन शो,मेट्रो के डब्बे बने कैटवॉक के लिए रैंप,बच्चे से लेकर बड़ो को कैटवॉक करता देख, यात्री हो गए दंग,. नागपुर मेट्रो " सेलिब्रेशन ऑन व्हील" नाम से एक योजना चलाती है pic.twitter.com/Bd9thFUTJU
— Yogendraindiatv (@indiatvyogendra) August 28, 2023