Cricket World Cup 2023: ఫ్యాన్స్ నోళ్లు మూయిస్తాం.. టీమిండియాకు ఛాలెంజ్ విసిరిన ఆసీస్ కెప్టెన్

Cricket World Cup 2023: ఫ్యాన్స్ నోళ్లు మూయిస్తాం.. టీమిండియాకు ఛాలెంజ్ విసిరిన ఆసీస్ కెప్టెన్

భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్లేసరికి టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని దాటేశాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన రోహిత్ సేన.. ఈ మెగా టోర్నీలో ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. దీంతో ఫైనల్లో ఆస్ట్రేలియాతో మన జట్టు విజయం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రేపు(నవంబర్ 19) భారత్, ఆస్ట్రేలియా మెగా ఫైనల్ కావడంతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం అభిమానులతో నిండిపోనుంది. లక్ష 30 వేల సీటింగ్ ఉన్న ఈ స్టేడియంలో భారత నినాదాలతో స్టేడియం హోరెత్తేలా కనిపిస్తుంది. 

ఈ స్టేడియంలో దాదాపు భారత అభిమానులే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రేపు అహ్మదాబాద్ క్రౌడ్ ను సైలెంట్ గా ఉంచుతామని ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ టీమిండియాకు ఛాలెంజ్ విసిరాడు. కమ్మిన్స్ మాట్లాడుతూ.. "ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకులు భారత్ వైపే మద్దతు తెలుపుతారని నాకు తెలుసు. ఇంత మంది ప్రేక్షకులను రేపు సైలెంట్ చేయడమే మా లక్ష్యం". అని కమ్మిన్స్ ధీమా వ్యక్తం చేసాడు. టీమిండియా ఓడిపోతేనే ప్రేక్షకులు అందరూ సైలెంట్ గా ఉంటారు. ఈ మ్యాచ్ లో గెలుస్తాం అని కమ్మిన్స్ పరోక్షంగా తెలియజేశాడు. 

ఈ వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆసీస్ జట్టు ఆ తర్వాత వరుసగా 7 లీగ్ మ్యాచ్ ల్లోనూ గెలిచి సెమీస్ కు వెళ్ళింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ సెమీ ఫైనల్ ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ తో ఫైనల్ సమరానికి సిద్ధమైంది. భారత్ తో పోలిస్తే ఆసీస్ కాస్త బలహీనంగానే కనిపిస్తున్న ఐసీసీ టోర్నీలంటే ఆ జట్టు చెలరేగి ఆడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆసీస్ జట్టుపై మన జట్టుపై శక్తికి మించి పోరాడితేనే ట్రోఫీ గెలవగలం.    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)