Pat Cummins: అప్పటివరకు వైట్ బాల్ సిరీస్ ఆడను.. క్రికెట్‌కు కమ్మిన్స్ షార్ట్ బ్రేక్

Pat Cummins: అప్పటివరకు వైట్ బాల్ సిరీస్ ఆడను.. క్రికెట్‌కు కమ్మిన్స్ షార్ట్ బ్రేక్

ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ క్రికెట్ కు చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నాడు. కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు. కమ్మిన్స్ తీసుకున్న ఈ నిరణయానికి కారణం లేకపోలేదు. 2026లో ఇంగ్లాండ్ పై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ జరగబోతుంది. ఈ మెగా సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. నవంబర్ 21 నుంచి యాషెస్ స్టార్ట్ అవుతుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. టెస్ట్ కెప్టెన్ గా కమ్మిన్స్ 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడాలంటే అతనికి రెస్ట్ కావాల్సి ఉంది. 

ప్రస్తుతం కమ్మిన్స్ వెస్టిండీస్ టూర్ లో ఉన్నాడు. ఈ పర్యటనలో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ ఆడతాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలిచి చివరి టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. టెస్ట్ సిరీస్ తర్వాత జరగబోయే 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ కు తాను అందుబాటులో ఉండదని కమ్మిన్స్ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా శనివారం (జూలై 12) న సౌతాఫ్రికాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కు దూరంగా ఉంటానని కన్ఫర్మ్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా మూడు వన్డేలు.. మూడు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

తాను నెల నుంచి ఆరు వారాల పాటు ఎలాంటి క్రికెట్ ఆడబోనని.. ఈ క్రమంలో తన ఫిట్ నెస్ పై పూర్తి ఫోకస్ పెడతానని కమ్మిన్స్ తెలిపాడు. సమ్మర్ లో సొంతగడ్డపై జరగబోయే యాషెస్ సిరీస్ కు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.  న్యూజిలాండ్, ఇండియాతో జరగబోయే సిరీస్ లకు తాను అందుబాటులో ఉండే అవకాశం ఉందని కంబ్యాక్ పై  హింట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడొచ్చని తెలిపాడు. ఐపీఎల్ టోర్నీ.. ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్ షిప్.. వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల సిరీస్ తో కమ్మిన్స్ గత నాలుగు నెలలుగా బిజీ క క్రికెట్ ఆడుతున్నాడు.