
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి సంస్థ కన్జూమర్ ప్రొడక్ట్స్ తోపాటు ఆయుర్వేదిక్ రెమిడీస్ ను అమ్ముతుందన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ కరోనా నివారణ రేసులో జాయిన్ అయిందని తాజా ఖబర్. మనీ కంట్రోల్ అనే లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ను బట్టిఈ విషయం తెలిసింది. ఇండియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎఫ్ఎమ్ సీజీ కంపెనీస్ లో పంతజలీ ఆయుర్వేదిక్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ కరోనా నివారణ మందులను కనుగొనడంలో భాగంగా రెగ్యులేటరీ అప్రూవల్స్ రాగానే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను ఆరంభించిందని మనీ కంట్రోల్ సమాచారం.
‘మేం ఇమ్యూనిటీని బూస్టర్ గురించి మాట్లాడట్లేదు. మేం వ్యాధి నివారణ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం’ అని పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ చెప్పారని మనీ కంట్రోల్ ద్వారా తెలిసింది. రిపోర్టు ప్రకారం.. గత వారం సంబంధిత పర్మిషన్స్ వచ్చిన వెంటనే ఇండోర్ తోపాటు జైపూర్ లోనూ పతంజలి కరోనా క్లినికల్ ట్రయల్స్ ను మొదలుపెట్టింది. అయితే పతంజలి లాంటి కంపెనీ వ్యాక్సిన్ రేసులో రావడం కొంచెం వింతగానే చెప్పొచ్చు. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు మాత్రమే ఉన్న వ్యాక్సిన్ రేసులో పతంజలి అడుగిడటం విశేషమని అనలిస్టులు చెబుతున్నారు.