ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కు పతంజలి రెడీ

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కు పతంజలి రెడీ

బహిరంగంగా ప్రకటించిన ఇండియన్ కంపెనీ

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా దెబ్బతో పడిపోయిన ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ మార్కెట్‌ .. మరోవైపు యాంటీ చైనా మూమెంట్‌ .. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ కోసం వెతుకుతున్న బీసీసీఐకి ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌.ఈ ఏడాది లీగ్‌ కు స్పాన్సర్‌ గా వ్యవహరించేందుకు తాము సిద్ధమని ‘పతంజలి’ బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. బాబా రామ్‌ దేవ్‌ ఆధ్వర్యంలో పని చేసే పతంజలి పూర్తిగా ఇండియన్‌ కంపెనీ. ఈ సంస్థ పలు ఆయుర్వేద మందులతో పాటు సబ్బులు, టూత్‌ పేస్ట్‌ వంటి ఎఫ్‌ ఎంసీజీ ప్రొడక్టులు తయారు చేసి విక్రయిస్తోంది. ఐపీఎల్‌ తో జతకడితే తమ బ్రాండ్‌ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పతంజలి భావిస్తోంది.

‘ఐపీఎల్‌ కు టైటిల్‌ స్పాన్సర్‌ గా వ్యవహరించేందుకు ఆలోచిస్తున్నాం. మా బ్రాండ్‌ కు గ్లో బల్‌ గా మరింత గుర్తింపు దక్కేందుకు లీగ్‌ సరైన వేదిక అని మా భావన’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌ .కె. తిజారావాలా వెల్లడించారు. మరి బీసీసీఐ దీనికి ఓకే చెబుతుందా? అన్నది తేలాలి. ఒకవేళ పతంజలితో కలిసి పని చేస్తే బీసీసీఐకి కూడా ఈ టైమ్‌లో లాభం చేకూరినట్లే. ఎందుకంటే స్పాన్సర్లు దొరకని కష్టకాలంలో ఎంతో కొంత అండ లభించడంతో పాటు యాంటీ చైనా మూమెంట్‌ కు చెక్‌‌ పెట్టినట్లు అవుతుంది.

నాలుగున్నర నెలలకే..

ఎవరూ ఊహించని విధంగా ఈసారి ఐపీఎల్‌ స్పాన్సర్‌ షిప్‌ రైట్స్‌‌ను బీసీసీఐ నాలుగున్నర నెలలకే పరిమితం చేసింది. అలాగే హయ్యెస్ట్ బిడ్‌ దాఖలు చేసిన కంపెనీకి డైరెక్ట్‌ గా రైట్స్‌‌ను కట్టబెట్టకుండా చిన్న మెలిక పెట్టింది. మొత్తం 13 క్లాజ్‌ లతో కూడిన ఎక్స్‌‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ)ని సెక్రటరీ జై షా సోమవారం రిలీజ్‌ చేశాడు. ఆసక్తి ఉన్న పార్టీలు ఈనెల 14 వరకు బిడ్‌ లను దాఖలు చేయొచ్చు. 18వ తేదీన స్పాన్సర్‌ ను ప్రకటిస్తారు. ‘ఆగస్ట్‌ 18 నుంచి డిసెంబర్‌ 31, 2020 వరకు రైట్స్‌‌ ఉంటాయి. ఈ పిరియడ్‌ కు మాత్రమే ఇంట్రెస్ట్‌ ఉన్న పార్టీలు ఈవోఐని దాఖలు చేయొచ్చు. హయ్యెస్ట్​  బిడ్‌ దాఖలు చేసిన కంపెనీతో బోర్డు చర్చలు జరుపుతుంది. అవి సంతృప్తికరంగా అనిపిస్తేనే రైట్స్‌‌ను కట్టబెడతారు. లేదంటే మరో పార్టీతో చర్చలు జరుపుతారు. ఈ విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్‌ బ్రాండ్‌ , విలువకు తగ్గకుండా నిర్ణయాలు ఉంటాయి. ఇతర పక్షాల హక్కులకు భంగం కలిగించకుండా చర్చలు జరుగుతాయి’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొం ది. బోర్డు క్లాజ్‌ లను బట్టి చూస్తే కనీసం ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలు మాత్రమే ఈవోఐ దాఖలు చేసే అవకాశం ఉంది. గతేడాది ఆడిట్‌ అకౌంట్స్‌‌ను కూడా తప్పనిసరిగా దీనికి జతపర్చాలని కండిషన్‌ పెట్టింది. మధ్యవర్తులు, ఏజెంట్ల ద్వారా వచ్చి న బిడ్‌ లను రద్దు చేస్తామని ముందుగానే హెచ్చరించింది.

2021 మెగా ఆక్షన్ లేనట్టేనా!

ఈ ఏడాది ఐపీఎల్‌ కార్యరూపం దాల్చకముందే.. 2021 ఎడిషన్‌ ను కరోనా మహమ్మారి ప్రభావితం చేసింది. ఈసారి లీగ్​ ఆలస్యంగా జరగనుండడంతో ఈ ఏడాది జరగాల్సిన ప్లేయర్ల మెగా ఆక్షన్​ రద్దు చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్​ను ప్రారంభించినప్పుడే 2021 ఎడిషన్​కు ముందు ప్లేయర్ల మెగా ఆక్షన్​ను ప్లాన్​ చేశారు. దీని ప్రకారం ధోనీ, కోహ్లీ వంటి స్టార్స్​తోపాటు లీగ్​లో ఆడాలనుకునే ప్రతీ ప్లేయర్​ వేలానికి వెళ్లాలి. దీని ద్వారా ఫ్రాంచైజీలకు తమ జట్టును రీక్రియేట్​ చేసుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మెగా ఆక్షన్​కు ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐ కూడా సిద్ధంగా లేదు. ఇందుకు సమయాభావమే ప్రధాన కారణం. ప్రతీ ఏడాది మార్చి –ఏప్రిల్​లో ఐపీఎల్​ జరుగుతుంది. కరోనా కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్​ 19న లీగ్​ మొదలవనుంది. నవంబర్​ 10 వరకు ఇది కొనసాగనుంది. ఆ వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా టూర్​కు వెళుతుంది. ఆ తర్వాత వరుస పెట్టి సిరీస్‌ లు ఆడాల్సి ఉంది. దీంతో బోర్డు కూడా తీరిక లేకుండా ఉండనుంది. దీంతో మెగా ఆక్షన్​ నిర్వహణకు బోర్డు సుముఖంగా లేదని తెలుస్తోంది. పైగా ఫ్రాంచైజీలు కూడా ఆక్షన్​కు రెడీగా లేవు. ఇప్పుడున్న సిచ్యువేషన్​లో ఇంత తక్కువ టైమ్​లో డబ్బు ఏర్పాటు చేసు కోవడం తమకు కూడా కష్టమని ఇటీవల జరిగిన మీటింగ్​లో ఫ్రాంచైజీలు కూడా బోర్డుకు చెప్పినట్లు తెలిసింది. దీంతో 2021 ఎడిషన్​లో ఇప్పుడున్న ప్లేయర్లతోనే జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే, ప్లేయర్ల రీప్లేస్‌మెంట్‌, బదలాయింపు గతంలో మాదిరిగానే చేసు కోవచ్చని బోర్డు వర్గాలు అంటున్నాయి.