కోటింగ్ గాజులు ఇచ్చి.. బంగారు గాజులు తీసుకెళ్లిండు

కోటింగ్ గాజులు ఇచ్చి.. బంగారు గాజులు తీసుకెళ్లిండు
  • జువెలరీ షాప్ నిర్వాహకులను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు 

జీడిమెట్ల, వెలుగు: ఓ షాపింగ్ మాల్​లోని జువెలరీ సెక్షన్ లో గోల్డ్ కోటెడ్ గాజులను ఎక్స్ చేంజ్ కింద ఇచ్చి కొత్త బంగారు గాజులను తీసుకెళ్లిన వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్​లోని జాలోర్ జిల్లా పన్ వాడ్ గ్రామానికి చెందిన మనీశ్​అలియాస్ దీపేశ్ కుమార్ సిటీకి వచ్చి బంగారం పనిచేస్తున్నాడు. గత నెల 15న సుచిత్ర ఏరియాలోని  సౌతిండియా మాల్​కు వచ్చిన దీపేశ్​కుమార్ అక్కడి జువెలరీ సెక్షన్​కు వెళ్లాడు.

గోల్డ్ కోటింగ్ ఉన్న 31 గ్రాముల నకిలీ బంగారు గాజులను ఎక్స్​చేంజ్ కింద ఇచ్చాడు. 27 గ్రాముల కొత్త బంగారు గాజులను తీసుకెళ్లాడు. గోల్డ్ కోటెడ్ గాజులపై హాల్ మార్క్ ఉండటంతో జువెలరీ సెక్షన్​లో ఉన్న సిబ్బంది అనుమానించలేదు. అయితే, ఆ గాజులను హెడ్డాఫీసుకు పంపించగా అవి రోల్డ్ గోల్డ్ అని తేలింది. దీంతో షాపింగ్ మాల్ మేనేజర్ పేట్​బషీరాబాద్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు దీపేశ్​కుమార్​పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.