సీఎంను కలిసిన పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ

సీఎంను కలిసిన పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ
  • కాంగ్రెస్​లో చేరిన జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్​

బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతలు షాకిచ్చారు. ఆ పార్టీ సీనియర్​ లీడర్‌‌‌‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌‌‌‌ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్‌‌ సునీత గురువారం సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిశారు. వీరు త్వరలోనే కాంగ్రెస్‌‌లో చేరుతారనే చర్చ జరుగుతోంది. పాతబస్తీకి చెందిన బీఆర్​ఎస్​ లీడర్, జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ ​పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్​ మున్షీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

కుటుంబంతో సహా వెళ్లి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి గురువారం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఆయన కలిశారు. త్వరలోనే ఆయన తన భార్య సునీతతో కలిసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరుతారనే చర్చ జరుగుతోంది. వీరి చేరిక కోసమే ఈనెల 5న జరగాల్సిన సీఎం కొడంగల్ పర్యటన వాయిదా పడిందన్న వాదన వినిపిస్తోంది. మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి భార్య సునీత, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. చేవెళ్ల నుంచి ఆమె కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.