న్యూఢిల్లీ: పవర్ సొల్యూషన్స్ సంస్థ పవరికా లిమిటెడ్ రూ.1,100 కోట్లు సమీకరణ లక్ష్యంగా మార్చి 24న ఐపీఓ ప్రారంభించనుంది. ఒక్కో షేరు ధరను రూ.375 నుంచి రూ.395 గా నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ విలువ సుమారు రూ.ఐదు వేల కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.700 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.300 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సేకరిస్తారు.
అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిధులను వినియోగిస్తారు. ఐపీఓ మార్చి 27న ముగుస్తుంది. వచ్చే నెల రెండో తేదీన లిస్టింగ్ ఉంటుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో పవరికాకు రూ.2,653 కోట్ల ఆదాయం వచ్చింది.
