అడవి పులి.. గొడవపడి.. ఊపేస్తున్న పవన్ పాట

V6 Velugu Posted on Nov 07, 2021

పవన్  కళ్యాణ్ హీరోగా వస్తున్న మూవీ ‘ భీమ్లా నాయక్’. ఈ సినిమా నుంచి తాజాగా లాలా భీమ్లా నాయక్ పాటను మూవీ టీం విడుదల చేసింది. దీంతో యూట్యూబ్‌లో ఇప్పుడీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. త్రివిక్రమ్ ఈ పాటను రాశారు. సినిమాలో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఊపును తీసుకోస్తోంది. 

మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమా సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇక ‘ లాలా భీమ్లా నాయక్ పాటను అరుణ్ కౌండిన్య మరింత పవర్‌ఫుల్‌గా పాడి అందరితో సూపర్ అనిపించుకుంటున్నాడు.  మరోవైపు ఈ సినిమాలో నటుడు రానా కీలకపాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రానా డేనియల్‌ శేఖర్‌గా కనిపించనున్నారు. ఈ పాటు  యూట్యూబ్‌లో విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పాట ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

Tagged Pawan kalyan, Bheemla Nayak, Lala Bheemla Lyrical Video, Lala Bheemla song, trivikram birthday

Latest Videos

Subscribe Now

More News