
మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో, తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ కు ఆడియన్స్ ను మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో పవన్ కనిపించిన తీరు గానీ, ఆయన చెప్పిన డైలాగ్స్ గానీ చాలా కొత్తగా ఉన్నాయి. మరోసారి తన మార్క్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో రచ్చ చేశారు పవన్. పవన్ నుండి గత కొంతకాలంగా ఫ్యాన్స్ ఎం మిస్ అవుతున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉండేలా కనిపిస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా చాలా స్టైలీష్ గా కనిపించారు. ముఖ్యంగా చెప్పాలంటే.. పవన్, సాయి ధరమ్ మధ్యే వచ్చే సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం కానున్నాయి. ఇద్దరినీ చాలా బాగా ప్రెసెంట్ చేశారు దర్శకుడు సముద్రఖని.
ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు చాలా బలమైన మెసేజ్ ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు. ప్రస్తుత జనరేషన్లో సమయానికి ఉన్న విలువ ఏంటి అనేది ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి మరి.