శ్రీశైలం ఘటనపై పవన్‌ కల్యాణ్ విచారం

శ్రీశైలం ఘటనపై పవన్‌ కల్యాణ్ విచారం

హైదరాబాద్: శ్రీశైలం పవర్‌ప్లాంట్‌‌లో జరిగిన ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ ‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. 9 మంది మృత్యువాత పడడం బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్ కోరారు. గురువారం అర్థరాత్రి అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే.