మాస్ సాంగ్‌‌‌‌ చిత్రీకరణలో.. ఉస్తాద్ భగత్ సింగ్

మాస్ సాంగ్‌‌‌‌ చిత్రీకరణలో.. ఉస్తాద్ భగత్ సింగ్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న  తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.  శనివారం  నుంచి  ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌‌‌‌లో ఓ మాస్ సాంగ్‌‌‌‌ను చిత్రీకరించనున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ సాంగ్   కంపోజ్ చేయగా, దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో  ఈ పాటను షూట్ చేయనున్నారు. సాంగ్ షూట్ కంప్లీట్ అవగానే, కంటిన్యూగా ఈ షెడ్యూల్‌‌‌‌ కొనసాగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌‌‌‌తో టాకీ పార్ట్‌‌‌‌  దాదాపు పూర్తి చేసేలా హరీష్ శంకర్ ప్లాన్ చేశారు.

 ఇందులో పవన్ కళ్యాణ్​ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు.  శ్రీలీల, రాశీ ఖన్నా  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు.  పార్థిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్‌‌‌‌ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్,  నాగమహేశ్, టెంపర్ వంశీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.  పవన్, హరీష్​ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.