కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఎందుకు బదిలీ చేసినట్టు?: పవన్

కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఎందుకు బదిలీ చేసినట్టు?: పవన్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు.  విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ.. కోరి తెచ్చుకున్న వ్యక్తిని,  మళ్ళీ  వాళ్లే కాదు పొమ్మని ఎందుకు బదిలీ చేశారని  వైసీపీ ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వ్యవహారం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు అర్థమవుతోందని అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ ..  ఇసుక కొరత వల్ల కార్మికులు ఐదు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇసుకపై ఇతర రాష్ట్రాల్లో లేని ఇబ్బంది ఇక్కడే ఎందుకని నిలదీశారు.  ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారన్నారు. కార్మికుల సమస్యలపై జనసేన పోరాటం చేస్తోందని, రెండు వారాల్లోపు సమస్య పరిష్కారానికి చొరవ చూపకకపోతే తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ తెలిపారు.

Pawan Kalyan responds on the transfer of AP CS LV Subramaniam