చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్న సీఎం జగన్

చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్న  సీఎం జగన్

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో చంద్రబాబును  ఏపీ సీఎం జగన్ ఆదర్శంగా తీసుకుంటున్నారని  జనసేన ట్వీట్ చేసింది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షపార్టీ టీడీపీ తీరును ప్రశ్నిస్తోంది జనసేన.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్కొక్కరికి హోటల్ డిన్నర్ బిల్ రూ. 1లక్ష చెల్లించారని వైసీపీకి చెందిన మీడియా సంస్థ  ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ ప్రతీ శుక్రవారం కోర్ట్ కు హజరువుతున్నారని, అందుకు ఖర్చు రూ.60లక్షల అవుతుందటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ కథనాలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ పోస్ట్ ట్వీట్ చేశారు. ఇద్దరూ దొందూ దొందే. చంద్రబాబు ఫ్యామిలీ కోసం రూ. లక్ష ఖర్చు చేస్తే …జగన్ కోర్టులో హాజరయ్యేందుకు రూ.60లక్షలు ఖర్చు చేస్తున్నారంటూ పోస్ట్ ను షేర్ చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంలో చంద్రబాబుతో జగన్ పోటీ పడుతున్నారంటూ చురకలంటించింది జనసేన.