ఓటు వేసిన పవన్..ఈవీఎంల మొరాయింపుపై అసంతృప్తి

ఓటు వేసిన పవన్..ఈవీఎంల మొరాయింపుపై అసంతృప్తి

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పడమటలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ .. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  అనంతపురం జిల్లా గుత్తిలో తమ అభ్యర్థి ఈవీఎంను నేలకేసి కొట్టడం తప్పిదమేనని అయితే.. అక్కడ వాస్తవంగా అక్కడ  ఏం జరిగిందో తెలుసుకుంటానన్నారు.  తెలుసు కోకుండా మాట్లాడటం సరికాదన్నారు . కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లు పనిచేయడం లేదని..ఈసీ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.