Pawan Kalyan: అల్లు అరవింద్, అల్లు అర్జున్ని పరామర్శించిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan: అల్లు అరవింద్, అల్లు అర్జున్ని పరామర్శించిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్

దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య కారణాలతో శనివారం (ఆగస్టు 30న) తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు.

ఈ విషాదంలో ఉన్న‘అల్లు’ కుటుంబ సభ్యులను నటుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యుటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. ఆదివారం  (ఆగస్టు 31న) హైదరాబాద్లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు అల్లు అర్జున్ని ఓదార్చారు. మిగతా అల్లు కుటుంబం సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

ఈ విషయాన్నీబేబీ మూవీ ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ X వేదికగా ఫొటోలు షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో, అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్‌లను పవన్ కళ్యాణ్ ఓదార్చి ధైర్యం చెప్పినట్లు కనిపిస్తోంది. 

అయితే, పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా  కనకరత్నమ్మ అంత్యక్రియలకు హైదరాబాద్‌ రాలేకపోయారు. శనివారం, ఆయన భార్య అన్నా లెజ్నెవా అల్లు అరవింద్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ఓదార్చారు.

కనకరత్నమ్మ చెన్నైలో ఉన్నప్పటి నుంచి తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారంటూ గుర్తుచేసుకున్నారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు. కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ పవన్‌ సోషల్‌ మీడియాలో శనివారం పోస్టు పెట్టారు.

తన అత్తగారి మరణంపై చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘మా అత్తయ్య.. దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.