
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోలుగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బ్రో'(Bro). జులై 28న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. పవన కళ్యాణ్ వింటేజ్ లుక్స్ కు ఆడియన్స్ మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మొదటిరోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన బ్రో సినిమా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 35.24 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోరును కంటిన్యూ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మొత్తంగా రెండు రోజుల్లో రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక పవన్ కెరీర్ రెండు రోజుల్లోనే ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమా ఇదే అవడం విశేషం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ పండగా చేసుకుంటున్నారు. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.