బ్రో విషయంలో అదే జరిగింది.. మేకర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది

బ్రో విషయంలో అదే జరిగింది.. మేకర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన బ్రో(Bro) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) కీ రోల్ లో కనిపించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎందుకో బ్రో సినిమాకు ముందునుండే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవలేదు. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించిన సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఆ క్రేజ్ ఎలా ఉండాలి? కానీ బ్రో సినిమాకు ఆ హడావుడి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. 

అయితే కావాలనే మేకర్స్ బ్రో సినిమాకు హైప్ క్రియేట్ అవకుండా చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం.. బ్రో అనేది నార్మల్ కమర్షియల్ సినిమా కాదు. అందుకే ముందే అంచనాలు పెంచేస్తే ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడే అవకాశం ఉంది అందుకే మేకర్స్ ఈ సినిమాకు లో ప్రమోషన్స్ మైంటైన్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇక కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయని సమాచారం. ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ సినిమాకు లాంగ్ రన్ ఉండాలని ఇలా ప్లాన్ చేశారట మేకర్స్. అందుకే టికెట్ ప్రైస్ లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ముందు అందరు ఆడియన్స్ కు సినిమా రీచ్ అయితే.. కలెక్షన్స్ ఆటోమేటిక్ వాస్తాయనేది మేకర్స్ అంచనా. ఇక మొదటిరోజు కూడా ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ  ఆడియన్స్ ఎక్కువగా ముందుకొచ్చారు. ఇది సినిమాకు ప్లస్ ఆయే అంశంలాగే కనిపిస్తోంది. వారి నుండి కూడా సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో వచ్చే రోజుల్లో బ్రో మూవీ కలెక్షన్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. 

ఇక బ్రో మూవీ సక్సెస్ మీట్ లో దర్శకుడు సముద్రఖని(Samutirakani) కూడా ఇదే విషయాన్ని మరోసారి వివరించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గానే తీసాం. అంతేకాదు చిన్నపిల్లలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని చెప్పుకొచ్చారు దర్శకుడు. మరి బ్రో సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.