పవన్ క్యారెక్టరైజేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే

పవన్ క్యారెక్టరైజేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే

హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ కు వేణు శ్రీరామ్ డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ మూవీలో చాలా భాగం వరకు షూటింగ్ పూర్తయింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మిగిలిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన మోషన్ పోస్టర్, మగువ మగువ అనే లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ తోపాటు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా ఒక టీవీ చానెల్ తో ఇంటరాక్షన్ సందర్భంగా వకీల్ సాబ్ మూవీ విశేషాలను డైరెక్టర్ వేణు శ్రీరామ్ పంచుకున్నారు. ఈ మూవీలో పవన్ రోల్ ఫ్యాన్స్ కు పండుగ లాంటిదన్నారు.

‘వకీల్ సాబ్ సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న మూవీ. మహిళలు ఎదుర్కొంటున్న నైతికత, తీర్పులు, శారీరక హాని గురించి ఈ ఫిల్మ్ లో చర్చిస్తున్నాం. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. ఒరిజినల్ స్క్రిప్ట్ లో పెద్దగా మార్పులు చేయలేదు. పవన్ బాడీ ల్యాంగ్వేజ్ కు తగ్గట్లుగా కొన్ని ఛేంజెస్ చేశాం. ఒరిజనల్ లో మాదిరే ఈ మూవీలో పవన్ ఆలస్యంగా ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్స్ ఫ్యాన్స్ విజిల్ వేసేలా ఉంటాయి. పవన్ క్యారెక్టరైజేషన్ ఆయన ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియన్స్ ను కూడా అలరిస్తుంది. వచ్చే ఏడాది థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కోసం నేను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా’ అని వేణు చెప్పారు.