- కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా
హైదరాబాద్, వెలుగు: అస్సాం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌహతి క్రైమ్ బ్రాంచ్‌లో ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, కావున ముందస్తు బెయిల్ ఇచ్చి రక్షణ కల్పించాలని ఖేరా తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సుజన గురువారం విచారించనున్నారు.
