అడవుల విధ్వంసాన్ని అడ్డుకుంటాం: పవన్ కల్యాణ్

అడవుల విధ్వంసాన్ని అడ్డుకుంటాం: పవన్ కల్యాణ్

పర్యావరణం నాశనమవుతుంటే బాధగా ఉందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అభివృద్ది పేరిట అడవుల విధ్వంసం జరుగుతుంటే రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

చిల్లర రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని… ప్రజాసమ్యలపై పోరాడతానన్నారు పవన్ కల్యాణ్. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటానని చెప్పారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా… హైదరాబాద్ లో జనసేన ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎంపీ రేవంత్ రెడ్డి, కోదండరాం, చాడవెంకట్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.