రూ.163 కోట్లు కట్టండి.. ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్

రూ.163 కోట్లు కట్టండి.. ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్

న్యూ ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డిపార్ట్ మెంట్ షాకిచ్చింది. ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నందుకుగానూ రూ.163.62 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఆ మొత్తం చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని డీఐపీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది. రూ.163,61,88,265 చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. 

ఆమ్ ఆద్మీ పార్టీ చెల్లించాల్సిన రూ.163 కోట్లలో రూ.99 కోట్ల 31 లక్షలు 2017 మార్చి 31 వరకు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఉపయోగించిన మొత్తం కాగా.. మిగిలిన రూ.64కోట్ల 31లక్షల్ని  వడ్డీ రూపంలో చెల్లించాలని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ  రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రకటనలను వాడుకోవడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలకు ఆదేశించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.