
ఉన్న ఊళ్లో వ్యవసాయం చేయలేక, వలస పోయి కార్పొరేట్ బానిస అవలేక, సొంత ఊరిలోనే ఎంట్రప్రెన్యూర్‌గా మారి పది మందికి పని కల్పించి, అంబానీలా లక్షలు, కోట్లు సంపాదించాలని కలలు కన్న ఓ మధ్యతరగతి యువకుడి కథ ‘పైలం పిలగా’. సాయి తేజ, పావని జంటగా ఆనంద్ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొద్దుల, ఎస్‌కే శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ చిత్రంలో శివ అనే 21 ఏళ్ల పిలగాడు.. అంబానీకి వీర అభిమాని. ఉద్యోగం వ్యవసాయం కాదు, వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదృష్టానికో, దురదృష్టానికో ఉన్న ఉళ్లోనే వీడికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో వచ్చిన ఇబ్బందులను శివ ఎలా ఎదుర్కొన్నాడు అనేది హాస్య భరితంగా చూపించే చిత్రమే ఇదని మేకర్స్ చెప్పారు. డబ్బింగ్ జానకి, చిత్రం శ్రీను, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చౌరస్తా యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో ఆరు పాటలను రామ్ మిర్యాల, చిత్ర, శ్రావణి భార్గవి పాడారు.