25 నుంచి పీసీసీ ఆదివాసీల బస్సు యాత్ర...పోస్టర్‌‌‌‌‌‌ను ఆవిష్కరించిన మీనాక్షి, మహేశ్ గౌడ్

25 నుంచి పీసీసీ  ఆదివాసీల బస్సు యాత్ర...పోస్టర్‌‌‌‌‌‌ను ఆవిష్కరించిన  మీనాక్షి, మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: దేశంలోని గిరిజనులకు ఆనాడు ప్రధాన మంత్రి హోదాలో ఇందిరా గాంధీ రిజర్వేషన్లను అమలు చేసి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పీసీసీ ఆదివాసీ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌‌‌‌ను ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ మల్లు రవి,  ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, ఇతర గిరిజన నేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.