జనగామ: పోలీసుల చొరవతో ఎగ్జామ్ సెంటర్‌‌‌‌కు స్టూడెంట్...పొరపాటున వేరే సెంటర్కు వెళ్లిన విద్యార్థిని

జనగామ: పోలీసుల చొరవతో ఎగ్జామ్ సెంటర్‌‌‌‌కు స్టూడెంట్...పొరపాటున వేరే సెంటర్కు వెళ్లిన విద్యార్థిని
  •     నిమిషాల వ్యవధిలో అసలు సెంటర్​కు తీసుకెళ్లిన పోలీసులు

జనగామ, వెలుగు: పొరపాటున వేరే సెంటర్​కు వచ్చిన ఓ స్టూడెంట్​పోలీసుల సహకారంతో అసలు సెంటర్​కు చేరుకొని ఎగ్జామ్​రాయగలిగింది. మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా మేడిపల్లికి చెందిన సిరిపురం అశ్విని మొదటిసారి జనగామలోని ఏబీవీ కాలేజీ సెంటర్​లో నీట్​ఎగ్జామ్​ రాశారు. ప్రస్తుతం రీ ఎగ్జామ్​కు పెంబర్తిలోని మహత్మా జ్యోతిబా పూలే సెంటర్​ కేటాయించారు. ఆమె పొరపాటున జనగామలోని ఏబీవీ కాలేజీకి వచ్చారు. 

సెంటర్​లోనికి వెళ్లడానికి హాల్​ టికెట్​చూపించగా ఈ సెంటర్​ కాదని పోలీసులు చెప్పారు. ఎగ్జామ్​ ప్రారంభం కావడానికి 20 నిమిషాలో సమయం ఉండడంతో అశ్విని కంగారుపడింది. విషయం తెలుసుకున్న జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్​.. పెంబర్తిలోని ఎగ్జామ్​ సెంటర్​కు పంపించాలని ఆదేశించారు. దీంతో ఎస్ఐ చెన్న కేశవులు వాహనంలో ఆమెను పెంబర్తిలోని సెంటర్​కు తీసుకెళ్లారు. ఎగ్జామ్​ సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో జనగామలో మరో ముగ్గురికి నీట్​ ఎగ్జామ్​ రాయడానికి అనుమతించ లేదు.