బాలసముద్రంలోని ‘కుడా’ ప్లాట్లు వేలం

బాలసముద్రంలోని ‘కుడా’ ప్లాట్లు వేలం

హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ప్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీపంలోని ఫ్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించారు. కుడా వైస్ చైర్మన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ సమక్షంలో నిర్వహించిన ఈ వేలంపాటకు బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. బాలసముద్రంలో ఉన్న కమర్షియల్ ప్లాట్ల విక్రయానికి గజానికి కనీస ధర రూ.50 వేలుగా నిర్ణయించారు.

దీంతో బహిరంగ వేలంలో గజానికి కనిష్ఠంగా రూ.66 వేల నుంచి  రూ.97వేల వరకు ధర పలికింది. మొత్తం ఎనిమిది కమర్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచగా, వాటిలో ఆరు ప్లాట్లు అమ్ముడయ్యాయి. దాంతో పాటు హనుమకొండ అంబేద్కర్ భవన్ సమీపంలోని కుడా ఆధీనంలో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను వేలానికి పెట్టగా, రెండింటిని బిడ్డర్లు కొనుగోలు చేశారు.

స్క్వేర్ ఫీట్ కు రూ.4,200 చొప్పున వేలం పాటలో విక్రయమయ్యాయి. కాగా, పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ వేలంపాట ద్వారా కుడాకు ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన బిడ్డర్లకు కుడా వైస్ చైర్మన్, కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ చేతుల మీదుగా అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్ పేపర్లను అందజేశారు. కార్యక్రమంలో కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు.. 

కాశీబుగ్గ(కార్పొరేషన్) : కాశీబుగ్గ అంబేద్కర్​ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు అంతరాయం కలిగిస్తూ నిర్వహిస్తున్న టీ దుకాణాన్ని జీడబ్ల్యూఎంసీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ గుర్తించారు. యజమానికి అనువైన ప్రదేశానికి తరలించాలని , నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.