జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌కు మద్దతు ఇవ్వండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌కు మద్దతు ఇవ్వండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • టీజేఎస్ చీఫ్ కోదండరాంకు పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్​ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం సహకరించాలని టీజేఎస్‌‌ చీఫ్‌‌ కోదండరాంను పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌ కోరారు. ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని టీజేఎస్‌‌ ఆఫీసుకు వెళ్లి, కోదండరాంను కలిశారు. అనంతరం మహేశ్ గౌడ్‌‌ మీడియాతో మాట్లాడుతూ.. మతవాద శక్తులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్‌‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. 

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన స్థాయిని మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, సెంటిమెంట్‌‌ను రాజేసి లబ్ధి పొందాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎలా సాగిందో మిత్రపక్షాలకు తెలుసని, ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్‌‌కు మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌ను గెలిపించాలని కోదండరాంకు విజ్ఞప్తి చేశారు.