మెహిదీపట్నం, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పరామర్శించారు. హైదరాబాద్ అడిక్‌మెట్ అచ్యుత్ మార్గ్‌లోని నివాసానికి వెళ్లి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మహేశ్ వెంట రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, సంపత్ కుమార్, తదితరులున్నారు.
