కాంగ్రెస్ బలోపేతంలో పంచాయతీ రాజ్ సంఘటన్ పాత్ర కీలకం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాంగ్రెస్ బలోపేతంలో  పంచాయతీ రాజ్ సంఘటన్ పాత్ర కీలకం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ పాత్ర చాలా కీలకమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ శివారులోని కీసర బాల వికాస్ ట్రైనింగ్ సెంటర్‌‌‌‌లో సోమవారం నుంచి రెండ్రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి పంచాయతీ రాజ్ సంఘటన్ శిక్షణా శిబిరానికి పీసీసీ చీఫ్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 

ఈ సంస్థ ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కీలకంగా పనిచేస్తుందనే పేరుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఈ సంస్థ ప్రతినిధులు గ్రామ అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక నివేదిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో వర్చువల్‌‌గా పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు పంచాయితీ రాజ్ సంఘటన్ కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి, అక్కడి ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కరించడంలో ఈ సంస్థ కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.