V6 News

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దోపిడీలో కవితకూ భాగస్వామ్యం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దోపిడీలో కవితకూ భాగస్వామ్యం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపణ
  •     ఆ దోపిడీపై ముందు వివరణ ఇవ్వాలని డిమాండ్​ 

హైదరాబాద్, వెలుగు: కొత్త పార్టీ పెట్టిన కవితకు  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని చెప్పారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దోపిడీలో కవితకూ భాగస్వామ్యం ఉందని, ముందు దీనిపై ఆమె వివరణ ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్​ చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఎన్ని పార్టీలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ చుట్టూ గుంట నక్కలు ఉన్నాయా? పంది కొక్కులు ఉన్నాయా? గత పదేండ్లలో కవితకు తెలియదా?’ అని ప్రశ్నించారు. కేటీఆర్ కు రాజకీయం తెలియదంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చని, ఆయన గురించి ఆమెకే ఎక్కువ తెలుసని పేర్కొన్నారు.   

రాబోయే ఎన్నికల్లో మెజార్టీ మైనార్టీలకు టికెట్లు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మైనార్టీలకు కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో పీసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ గా ఇర్ఫాన్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనార్టీ కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.