బీసీ కోటాపై త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం.. అంబర్ పేటలో పీసీసీ చీఫ్ బైక్ ర్యాలీ

బీసీ కోటాపై త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం.. అంబర్ పేటలో పీసీసీ చీఫ్ బైక్ ర్యాలీ

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ డిపోల్లో నిలిచిపోయాయి.   బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా మంత్రులు కూడా బంద్ లో పాల్గొన్నారు. 

మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి, జగిత్యాలలో అడ్లూరి లక్ష్మణ్,  ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వాకిటీ శ్రీహరి,ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొనగా..  అంబర్ పేటలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి బైక్ ర్యాలీ తీశారు.

 ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..బీసీ బంద్ విజయవంతం అయ్యిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంది కాబట్టే అసెంబ్లీలో ఆమోదించామన్నారు.బీసీరిజర్వేషన్లపై సీఎం రేవంత్ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తామన్నారు.