ఆర్మీని చూసి గర్వపడుతున్న..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ట్వీట్

ఆర్మీని చూసి గర్వపడుతున్న..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ తో రక్షణ రంగంలో భారత దేశ ప్రతిష్టను మన ఆర్మీ మరింత పెంచిందని  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. భారత ఆర్మీని చూసి తాను గర్వపడుతున్నానని పేర్కొంటూ బుధవారం ట్వీట్ చేశారు. టెర్రరిజానికి భారత్ ఎప్పుడూ భయపడదని..ఐక్యత, ఆత్మగౌరవం, ధైర్యం అనే ఆయుధాలతో భారత్ ఎలాంటి సవాళ్లనైనా అధిగమిస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు దేశ ఐక్యత కోసం ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.