
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలో కాంగ్రెస్ పట్ల పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాల పై పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని, పోలీసుల వైఖరి ఇలాగే కొనసాగితే పార్లమెంట్‌లో, అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు శనివారం కాంగ్రెస్ బృందం వెళ్తుందని, పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని అన్నారు. తాము కోవిడ్ నిమయాలు పాటించే వెళ్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.