V6 News

కేంద్ర మంత్రిగా ఉంటూ శవ రాజకీయాలా? : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

కేంద్ర మంత్రిగా ఉంటూ శవ రాజకీయాలా? : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
  • బండి సంజయ్​పై పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల  సందర్భంగా  వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సహాయం మంత్రిగా ఉంటూ బండి సంజయ్ నడిరోడ్డు మీద ధర్నాకు దిగడంతో సామాన్య జనం ముక్కున వేలేసుకున్నారన్నారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు అంగీకరించగా,  బండి సంజయ్ వెళ్లి అడ్డుకున్న తీరు శవాల దగ్గర పేలాలు ఏరుకున్నట్లుగా ఉందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుందని, దీనిపై ఆర్టీసీ జేఏసీ నేతలు, కుటుంబ సభ్యులు సంతృప్తి చెందినా బండి సంజయ్ మాత్రం  శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం బీజేపీ నేతలు మానుకోవాలని, బండి సంజయ్ వ్యవ హరించిన తీరు కేంద్ర మంత్రిగా కాకుండా గళ్లీ లీడర్ ప్రవర్తనను గుర్తుకు తెస్తుందన్నారు.