10 మంది సభ్యులతో పీసీసీ లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల వార్ రూం

10 మంది సభ్యులతో పీసీసీ లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల వార్ రూం

హైదరాబాద్, వెలుగు: వచ్చే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు గెలుచుకునేందుకు 10 మంది సభ్యులతో పీసీసీ వార్ రూం కమిటీ ఏర్పాటైంది. దీనికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌ఆచర్జి దీపాదాస్ మున్షి ఆమోదం చెప్పినట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా పవన్ మల్లాడిని నియమించారు. సభ్యులుగా సందేశ్ సింగల్కర్, సతీశ్‌‌‌‌‌‌‌‌ మన్నే, సంతోష్ రుద్ర, జక్కని అనిత, వసీం బాషా, ఆరన్ మీర్జా, శ్రీకాంత్ కుమ్మరి, గిరిజ షెట్కార్, నవీన్ పట్టెం ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా ఈ కమిటీ ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందించనుంది.