ముషీరాబాద్, వెలుగు: పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్రంలోని ఆర్థిక మూలాలను కొల్లగొట్టిందని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ ఆరోపించారు. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చి ప్రాజెక్టులు దేవాలయాలు, సెక్రటేరియట్ కడితే అప్పు కాదా అని బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ నాయకులు యాత్రల పేరిట తిరుగుతూ కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ న్యాయ యాత్రకు ప్రజలంతా మద్దతుగా నిలబడాలని కోరారు.
