ఓటర్ కార్డులపై బీజేపీఆరోపణలు అవాస్తవం : పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ

ఓటర్ కార్డులపై బీజేపీఆరోపణలు అవాస్తవం : పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ

హైదరాబాద్, వెలుగు: తనకు రెండు ఓటర్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉన్నాయన్న బీజేపీ ఆరోపణలను పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ ఖండించారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ..ఏఐసీసీ మీడియా ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ పవన్ ఖేరాపై, తనపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 2017లో ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్‌‌‌‌కు మారే సమయంలో ఫామ్ 6ను ఎన్నికల సంఘానికి ఇచ్చామని, దానికి ఈసీ అధికారులు ఎకనాలెడ్జ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 

అయితే, ఫామ్ 6 ఇచ్చిన తర్వాత తమ అడ్రస్‌‌‌‌ను ఈసీ మార్చాల్సి ఉండగా, మార్చకపోవడం ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ తప్పిదమన్నారు. ఇండిపెండెంట్ సంస్థ అయిన ఈసీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రెండు ఓట్లు కలిగి ఉన్నానని పదే పదే తనను బద్నాం చేస్తున్న బీజేపీ నేతలపై లీగల్‌‌‌‌గా పోరాటం చేస్తానని ఆమె హెచ్చరించారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములం అవుతున్నామని, అందుకే తమపై బీజేపీ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తమను ఎంత బద్నాం చేసినా ఓట్ చోరీ పోరాటంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.