ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు : తోటకూర వజ్రేష్ యాదవ్

ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు : తోటకూర వజ్రేష్ యాదవ్

ఘట్ కేసర్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం కృషితో కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి అని, ఆయనను విమర్శించే స్థాయి వారసత్వంగా వచ్చిన కేటీఆర్ కు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మండిపడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ , మేడ్చల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డిని డమ్మీ అభ్యర్థి అనడం కేటీఆర్ కు తగదని హితవుపలికారు. బీఆర్ఎస్ అభ్యర్థిని మల్కాజిగిరిలో గెలిపిస్తావా అని ఆయన సవాల్ చేశారు.  ఘట్ కేసర్ టౌన్ లో ఆదివారం మీడియా సమావేశంలో వజ్రేష్ యాదవ్ మాట్లాడారు. మేడ్చల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఒక్క ఓటు బీఆర్ ఎస్ అభ్యర్థికి ఎక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఓడిపోతే మీరు, మీ ఎమ్మెల్యే మల్లారెడ్డి లు రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.