- ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ
హైదరాబాద్, వెలుగు: అటవీ విస్తీర్ణం పెంపులో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రిన్సిపల్ చీఫ్ కన్జ ర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు. తెలంగాణలోని అటవీ కళాశాల, అ టవీ పరిశోధన సంస్థను అధ్యయనం చేసేందుకు బిహార్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడారు. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి ఎఫ్ఆర్సీఐ ములుగు వేగంగా అభివృద్ధి చెందడంతో దేశంలోని అటవీ విద్యాసంస్థల్లో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. బిహార్ ఐఎఫ్ఎస్ అధికారులు హరితనిధి స్కీమ్‌ను పరిశీలించారు.
ఈ పథకం ఎలా ప్రారంభమైంది.. నిధుల సేకరణ, వినియోగం ఎలా జరుగుతుంది.. పారదర్శక వ్యవస్థ, గ్రామీణస్థాయిలో అమలు అయ్యే విధానాలను సువర్ణ వివరించారు. హరిత నిధితో ఉద్యోగుల్లో మొక్కల పెంపు బాధ్యత ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న హరితనిధి స్కీ మ్ బిహార్ లో అమలు చేసే దిశగా ప్రయత్నిస్తామని బిహార్ ఐఎఫ్ఎస్ అధికారులు పేర్కొన్నారు.
