ఓటెత్తిన ఇందూరు..నిజామాబాద్ కార్పొరేషన్ లో ఓటింగ్ శాతం 59.12

ఓటెత్తిన ఇందూరు..నిజామాబాద్ కార్పొరేషన్ లో ఓటింగ్ శాతం 59.12
  • భీంగల్​లో 63.65, ఆర్మూర్​లో 68.0, బోధన్ మున్సిపాలిటీలో 68.64 శాతం ఓటింగ్ నమోదు
  • కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటింగ్​శాతం 69.48
  • ఓటింగ్​లో ఉత్సాహంగా పాల్గొన్న యువతీయువకులు, వృద్ధులు
  • అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు

నిజామాబాద్​/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి ఇందూర్​జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా కార్పొరేషన్​, మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఉదయం నుంచే యువతీయువకులు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. నిజామాబాద్​ కార్పొరేషన్​లో ఓటింగ్​ శాతం 59.12 నమోదుకాగా,  భీంగల్​లో 63.65, ఆర్మూర్​లో 68.0, బోధన్ మున్సిపాలిటీలో 68.64 శాతం పోలింగ్ నమోదైంది.

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 69.48 శాతం ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్​జిల్లాలో కలెక్టర్​ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య పోలింగ్​సెంటర్లను పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​, ఎస్పీ రాజేశ్​చంద్ర ఓటింగ్​సరళిని పరిశీలించారు. నిజామాబాద్​లోని 47వ డివిజన్​లో పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్​, 45వ డివిజన్​లో ఎంపీ అరవింద్​ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని  ఆయా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు  ఓటు వేశారు.   

భీంగల్ మున్సిపాలిటీలో... 

బాల్కొండ : భీంగల్ మున్సిపాలిటీలో పోలింగ్​ముగిసే సమయానికి 63.65 శాతం ఓటింగ్​నమోదైంది.  ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఒక పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్థానిక జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.  

బోధన్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో..

బోధన్ : బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  69,417 మంది ఓటర్లలో మహిళలు 35,723 మంది, పురుషులు 33,693 మంది ఉన్నారు. పోలింగ్​ముగిసే సమయానికి 68.64 శాతం ఓట్లు నమోదయ్యాయి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో విజయమేరి, రాకాసిపేట్ గవర్నమెంట్ స్కూల్, హరిజనవాడ, సరస్వతీ నగర్‌‌‌‌‌‌‌‌లోని విజేత కాలేజీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

20, 21 వార్డుల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్  మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.  22వ వార్డులో ఒక పార్టీకి చెందిన ఏజెంట్ స్థానంలో మరొకరు ఐడీ కార్డు ధరించి కూర్చోవడంతో గొడవ జరిగింది. 27వ వార్డులో ఇద్దరు మహిళలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. పలుచోట్ల దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు.  

ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో..

ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపాలిటీలోని 36 వార్డుల్లోని 106 పోలింగ్ కేంద్రాల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. 63,972 మంది ఓటర్లకుగాను మహిళలు 23,709 మంది, పురుషులు 19,791 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య పోలింగ్ సరళిని పరిశీలించారు.

అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సాధారణ పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌వో సత్యనారాయణ, ఏఆర్వో భూమేశ్వర్ తదితరులు కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి డిగ్రీ కాలేజీ స్ట్రాంగ్ రూమ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.  

బాన్సువాడ మున్సిపాలిటీలో..

బాన్సువాడ మున్సిపాలిటీలో పోలింగ్​ముగిసే సమయానికి 73.66 శాతం ఓట్లు పోలయ్యాయి.  24,188 మంది ఓటర్లకుగాను 17,818 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్​, ఎస్పీ ఓటింగ్​సరళిని పరిశీలించారు. 

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో... 

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పోలింగ్​ముగిసే సమయానికి 79.77 శాతం ఓట్లు పోలయ్యాయి. 13,265 మంది ఓటర్లకుగాను 10,581 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే మదన్మోహన్‌‌‌‌‌‌‌‌రావు గన్‌‌‌‌‌‌‌‌మెన్లు, పీఏలతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదం జరగగా,  అరెస్ట్ చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.కలెక్టర్​, ఎస్పీ ఓటింగ్​సరళిని పరిశీలించారు. 

బిచ్​కుంద మున్సిపాలిటీలో... 

బిచ్​కుంద మున్సిపాలిటీలో పోలింగ్​ముగిసే సమయానికి 78.49 శాతం ఓట్లు పోలయ్యాయి. 12,759 మంది ఓటర్లకుగాను 10,014 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉన్నతాధికారులు ఓటింగ్​సరళిని పరిశీలించారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో...

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 69.48 పోలింగ్​ శాతం నమోదైంది. కామారెడ్డిలో పోలింగ్​ముగిసే సమయానికి 65.94 శాతం ఓట్లు పోలయ్యాయి. 99,313 మంది ఓటర్లకుగాను 65,483 మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డిలోని కొన్ని వార్డుల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు గొడవ పడ్డారు. కొన్ని చోట్ల ఓటు వేయటానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు.

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్​చంద్ర కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్​సరిళిని పరిశీలించారు.  9 వ వార్డులోని నిజాంసాగర్ రోడ్డు ఓ ప్రైవేట్ కాలేజీ సెంటర్​వద్ద  కాంగ్రెస్​, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది.  దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ అభ్యర్థి నరేందర్​రెడ్డి అడ్డుకోగా గుర్తుతెలియని వ్యక్తి  రాయి విసరడంతో బీజేపీ కార్యకర్త సతీశ్​రెడ్డి గాయాలయ్యాయి.  22 వ వార్డు బీడీ కార్మిక కాలనీ వద్ద  బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.  44వ వార్డు పోలింగ్​ బూత్​ ​ గంజు స్కూల్ వద్ద బీజేపీ, కాంగ్రెస్​ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.