రాజాపురంలో ఘనంగా పెద్దమ్మతల్లి జాతర

రాజాపురంలో ఘనంగా పెద్దమ్మతల్లి జాతర

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : మండలంలోని రాజాపురంలో పెద్దమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆలయ పూజారులు, భక్తులు   మేళతాళాలతో,  సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా సరువులను తీసుకొచ్చి  నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. అమ్మవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం నిప్పుల గుండం తొక్కడానికి యువతి, యువకులు పోటీ పడ్డారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.