పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యిండు: గడ్డం వంశీకృష్ణ

పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యిండు: గడ్డం వంశీకృష్ణ

 పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యారని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు, భూ దందాలు, ఇసుక దందాలతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయని నాయకులు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం ,దౌర్జన్యాలు చేసిన కొప్పుల ఈశ్వర్ ఎలా ప్రచారం చేస్తారని అన్నారు.   కేసీఆర్ దత్తత పుత్రునిగా బాల్క సుమన్ కు  కనీసం ఎంపీ టికెట్ కూడా దక్కలేదన్నారు.

చెన్నూరు నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు గడ్డం వంశీకృష్ణ. రోడ్లు డ్రైనేజీలు సరిగా లేవన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ రాక్షస పాలన కొనసాగిందన్నారు. కాకా హయాంలోనే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను పెద్దపల్లి ఎంపీగా ప్రజలు ఆదరిస్తే..పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎలక్ట్రోల్ అంటేనే అధికారికంగా లంచం ఇవ్వడమేనన్నారు .బీఆర్ఎస్  బీజేపీకిలకు వందల కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపలంలో కట్టబెట్టారని చెప్పారు.

మిషన్ భగీరథలో 40 వేల కోట్ల స్కాం: వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగితే ..  మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఆంధ్రా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్ ప్రజల సొమ్మును దోచిపెట్టారని ఆరోపించారు.  అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లకే ఎక్కువ సొమ్మును కట్టబెట్టారని విమర్శించారు. మనీ లాండరింగ్ కు  పాల్పడిన కాంట్రాక్టర్లు ఇతర సంస్థలపై ఈడీ విచారణ జరపాలన్నారు.  మనీ లాండరింగ్ పేరుతో వేలకోట్లను దోచుకుని వాళ్ళ సొంత ఆస్తులను పెంచుకున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బ్రాండ్ల పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.