బీజేపీ దేశాన్ని అమ్మేసింది ట్రంప్‌‌ కు మోదీ లొంగిపోయారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బీజేపీ దేశాన్ని అమ్మేసింది ట్రంప్‌‌ కు మోదీ లొంగిపోయారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. మన దేశాన్ని నడిపే స్టీరింగ్‌‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌కు మోదీ అప్పగించారని మండిపడ్డారు. దీంతో ట్రంప్ దేశాన్ని కనుసైగతో శాసిస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తారని గుర్తుచేశారు.

అమెరికా ఏవిధంగా మన దేశాన్ని నడిపిస్తుందో ఆధారాలతో స్పష్టంగా వివరించారన్నారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌‌కు మోదీ లొంగిపోయారని, ఇండియా భవిష్యత్‌‌ను అమెరికాకు అమ్మేశారని విమర్శించారు. ఈ పరిణామంతో దేశ యువత భవిష్యత్, రైతులు, ఉద్యోగాలు, ఇతర అన్ని వర్గాలు అమెరికా చేతుల్లోకి వెళ్లాయన్నారు.

అలాగే, ఇండియాపై 3 శాతం ఉన్న పన్నులను అమెరికా 18 శాతానికి పెంచిందన్నారు. అంటే దాదాపు ఆరు రెట్లు పన్నులు పెరిగాయని వివరించారు. దీని ప్రభావం దేశ ప్రజలపై పడుతుందన్నారు. దాదాపు రూ. లక్ష కోట్లకు పైగా వివిధ రంగాలపై ఈ భారం పడనుందని ఎంపీ వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.