పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజా గాయకుడు అందెశ్రీ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అందెశ్రీ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ గీతాలు, గానం ప్రజల్లో చైతన్యం రగిలించాయని పేర్కొన్నారు. “జయ జయహే తెలంగాణ”రూపంలో ఆయన రచన తెలంగాణ ఆత్మగా నిలిచిందని, ప్రతి తెలంగాణవాడి హృదయంలో శాశ్వతంగా నిలుస్తుందని తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు వంశీకృష్ణ సానుభూతి తెలియజేశారు.
