పెద్ది పాట కోసం.. పెద్ద ప్లాన్

పెద్ది పాట కోసం.. పెద్ద ప్లాన్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా  బుచ్చిబాబు సాన  రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా, మరోవైపు  ప్రమోషన్స్‌‌‌‌లోనూ జోరు పెంచేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.  వినాయక చవితి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట.  ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి సెకండ్‌‌‌‌ సాంగ్‌‌‌‌ షూటింగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు పెద్ద ప్లాన్ వేశాడని తెలుస్తోంది. ఈ సాంగ్‌‌‌‌ను  శ్రీలంకలో చిత్రీకరించనున్నారట. 

ఇప్పటికే టీమ్ అంతా శ్రీలంకకు పయనమైనట్టు సమాచారం. రామ్ చ‌‌‌‌ర‌‌‌‌ణ్, జాన్వీ క‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌పై వ‌‌‌‌చ్చే ఈ మాంటేజ్ సాంగ్‌‌‌‌ కేవ‌‌‌‌లం పాట‌‌‌‌లా మాత్రమే కాకుండా క‌‌‌‌థ‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లేలా డిజైన్ చేశారట.  దీనికోసం  ఏఆర్ రెహమాన్  బ్యూటిఫుల్ మ్యూజిక్‌‌‌‌ను కంపోజ్ చేసే పనిలో ఉన్నారట.  స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో  శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  

 మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం  మార్చి 27  రామ్ చరణ్   పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.