
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న చిత్రం‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు సోమవారం అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మ్యూజికల్ స్టూడియోలో ఏఆర్ రెహమాన్‌తో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. చాన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని తెలిపారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.